ఎస్సీల వర్గీకరణ చట్టం తీసుకొచ్చి, అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ఎమ్ఎస్పి జాతీయ నేత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి దళిత రత్న అవార్డు గ్రహీత మంద కుమార్ మాదిగ.
లోకల్ గైడ్ తెలంగాణ,వరంగల్ జిల్లా ప్రతినిధి:
నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఎమ్ఎస్పి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలకు ముఖ్య అతిథులుగా ఎమ్ఎస్పి జాతీయ నేత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి దళిత రత్న అవార్డు గ్రహీత మంద కుమార్ మాదిగ పాల్గొని రిలే నిరాహారదీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో ప్రజా పాలన అబివృద్ధి సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సందర్భంగా మీరు తక్షణమే ఎస్సీల వర్గీకరణ చట్టం తీసుకొచ్చి, అసెంబ్లీలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రూప్ వన్, గ్రూప్ టు, గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీని ఎస్సీల వర్గీకరణ ప్రకారమే భర్తీ చేయాలని లేకుంటే మాదిగల తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎస్పి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కళ్ళపల్లి ప్రనాయ్ దీప్ మాదిగ, తడుగుల విజయ్ మాదిగ, సింగారాపు మదు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comment List