త‌మిళ‌నాడు విద్యార్థుల భ‌విష్య‌త్తును డీఎంకే నాశ‌నం చేస్తోంది

త‌మిళ‌నాడు విద్యార్థుల భ‌విష్య‌త్తును డీఎంకే నాశ‌నం చేస్తోంది

లోకల్ గైడ్:

త‌మిళ‌నాడు విద్యార్థుల భ‌విష్య‌త్తును డీఎంకే నాశ‌నం చేస్తున్న‌ద‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ తెలిపారు.లోక్‌స‌భ‌లో ఇవాళ ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ..నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ అమ‌లు అంశంలో దేశాన్ని డీఎంకే త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌న్నారు.త‌మిళ‌నాడు విద్యార్థుల భ‌విష్య‌త్తును డీఎంకే నాశ‌నం చేస్తున్న‌ద‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ తెలిపారు.లోక్‌స‌భ‌లో ఇవాళ ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ..నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ అమ‌లు అంశంలో దేశాన్ని డీఎంకే త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌న్నారు.హిందీ భాష అమ‌లు అంశంలో త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కూడా ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఆరోపించారు.త్రీ లాంగ్వేజ్ పాల‌సీని త‌మిళ‌నాడు వ్య‌తిరేకిస్తోంద‌న్నారు.రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ అంశాన్ని రాజ‌కీయం చేస్తోంద‌ని,త‌మిళ‌నాడు విద్యార్థుల భ‌విష్య‌త్తును గంద‌ర‌గోళంలోకి నెట్టేస్తోంద‌న్నారు.డీఎంకే అనాగ‌రికంగా,అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.మంత్రి ధ‌ర్మేంద్ర వ్యాఖ్య‌ల‌తో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది.డీఎంకే ఎంపీలు స‌భ‌లో నినాదాలు చేస్తూ స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు.పీఎం శ్రీ స్కీమ్‌పై అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి బ‌దులిస్తూ..కేంద్ర స్కీమ్‌ను అమ‌లు చేసే అంశంలో డీఎంకే నేతృత్వంలోని త‌మినాడుళ స‌ర్కారు యూ ట‌ర్న్ తీసుకున్న‌ట్లు చెప్పారు.ఎన్ఈపీ స్కీమ్‌పై ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రాష్ట్రానికి నిధులు మంజూరీ అవుతాయ‌న్నారు.అయితే తొలుత ఆ ఒప్పందం కుదుర్చుకునేందుకు త‌మిళ‌నాడు స‌ర్కారు సిద్ద‌మైంద‌ని,కానీ ఇప్పుడు ఆ పార్టీ త‌న వైఖ‌రిని మార్చుకుంద‌ని తెలిపారు.క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లాంటి బీజేపీ యేత‌ర రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు చెప్పారు.పీఎం శ్రీ స్కీమ్ కింద ఒప్పందం కుదుర్చుకోవ‌డానికి త‌మిళ‌నాడు వ‌ద్ద ఇంకా 20 రోజుల స‌మ‌యం ఉంద‌న్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?