రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ను నిందించడం దినచర్యలో భాగమైంది : నిరంజన్ రెడ్డి 

రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ను నిందించడం దినచర్యలో భాగమైంది : నిరంజన్ రెడ్డి 

లోకల్ గైడ్, హైదరాబాద్:

సీఎం రేవంత్ రెడ్డి కి కేసీఆర్ ను ,బీ ఆర్ ఎస్ ను నిందించడం దినచర్యలో భాగమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఎక్కడికి పోయినా కేసీఆర్ ను తిట్టడం ఆయనకు అలవాటై పోయింది . ఇందిరాగాంధీ గతం లో ప్రతి దానికి  విదేశీ హస్తం ఉంది అని అభాసుపాలయ్యారు. ఇపుడు రేవంత్ రెడ్డి ప్రతి దాంట్లో కేసీఆర్ హస్తం ఉందని అంటూ ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చింది ఏడేండ్ల కిందటే ఏదో తన వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి భ్రమ పడుతుంటారు.అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వారు పాలన లోనూ అబద్దాలు ఆడుతున్నారు. స్వాతంత్ర ఉద్యమం లో సంబంధం లేని వాళ్ళు గాంధీజీ ,నెహ్రూ లను తిడుతుంటారు. అయినా గాంధీజీ నెహ్రూలు చిన్న వారు అయి పోతారా ?.తెలంగాణ ఉద్యమం తో సంబంధం లేని రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ ను ప్రతి దానికి నిందిస్తున్నారు ..కేసీఆర్ గురించి ప్రజలకు అంతా తెలుసు.కేసీఆర్ పట్ల ద్వేష భావం పెంపొందించే రేవంత్ ప్రయత్నాలు సఫలం కావు.వనపర్తి కి రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా ప్రకటించింది ఏమీ లేదు.వనపర్తి లో అంతటా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయి .కేసీఆర్ శంఖుస్థాపన చేసిన పనులకు రేవంత్ రెడ్డి కి సిగ్గు లేకుండా మళ్ళీ శిలాఫలకాలు వేశారు .సీఎంఓ ,ఇంటెలిజెన్స్ వాళ్ళు రేవంత్ రెడ్డి కి ఆ పనులు కేసీఆర్ హయం లో మొదలయ్యాయని రేవంత్ కు కనీస సమాచారం ఇవ్వలేదా ?..మెడికల్ ,నర్సింగ్ కళాశాలలు ,ఇతర విద్యాసంస్థలన్నిటికీ కేసీఆర్ హయం లోనే నిధులు మంజూరు అయ్యాయి .రేవంత్ చేసిందేమిటి ?.వనపర్తి లో ఐటీ టవర్ కి కే టీ ఆర్ కు శంఖుస్థాపన చేశారు .ఆ శిలాఫలకాన్ని పగలగొట్టి మళ్ళీ సీఎం రేవంత్ కొత్తగా శంఖుస్థాపన చేశారు .ఇలాంటి చిల్లర పనులు చేయడం సీఎం పదవికే కళంకం.చేసిన పనులకే మళ్ళీ కొబ్బరి కాయలు కొడితే సీఎం ,మంత్రి పదవులకు గౌరవం ఉంటుందా ?.వనపర్తి తో రేవంత్ రెడ్డి తనకున్న సంబంధం గురించి గొప్పగా చెప్పుకోవడం మంచిదే ..వనపర్తి రాజు సంస్థానం లో రాష్ట్రం లో మొట్టమొదటి పాలిటెక్నిక్ కళాశాల ఉండేది .ఆ భవనం శిథిలావస్థకు చేరుకుంటే 21 కోట్ల రూపాయలు నేను మంజూరు చేయించి కే టీ ఆర్ తో శిలాఫలకం వేయించా .మళ్ళీ ఆ భవనం పనులకు సీఎం రేవంత్ రెడ్డి శిలాఫలకం వేశారు..ఇందుకేనా రేవంత్ సీఎం అయ్యింది ?.జే ఎన్ టి యూ ను వనపర్తికి తెచ్చింది నేను .కళాశాలలు మొదలై మూడేళ్లు అవుతోంది .బీసీ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ మహిళా కాలేజీ ని నిబంధనలు మార్చి వనపర్తి లో ఏర్పాటు చేయించాం .రేవంత్ రెడ్డి వనపర్తి లో చదువుకున్నారు ..అప్పటికీ తెలంగాణ రాష్ట్రం లో వనపర్తి లో వచ్చిన మార్పు కనిపించలేదా ?.3250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించా.అవి రేవంత్ కు హెలికాఫ్టర్ నుంచి కనిపించలేదా ?.వనపర్తి లో మారిన రోడ్ల పరిస్థితి రేవంత్ కు కనిపించలేదా ?.జూరాల ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని రేవంత్ అంటున్నారు .పద్నాలుగు యేండ్ల క్రితం పూర్తయిన జూరాల ప్రాజెక్టు ను సీఎం పూర్తి చేస్తారట .రేవంత్ రెడ్డి ఓ రెబెల్ కార్యకర్త లా మాట్లాడుతున్నారు .రేవంత్ రెడ్డి మాటలతో రాష్ట్రం పరువు పోతోంది.సంస్కారం లేని మాటలతో తెలంగాణ పరువు తీయొద్దని రేవంత్ కు చేతులు జోడించి వేడుకుంటున్నా.హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి గా ఉన్నపుడు మేమంతా కష్టపడి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రయత్నించాం .జూపల్లి కి పార్టీ మారగానే కేసీఆర్ చెడ్డగా కనిపిస్తున్నాడు .కేసీఆర్ హాయం లో ఏం జరగలేదని జూపల్లి అద్వాన్నంగా మాట్లాడుతున్నారు .వనపర్తి కి నేనేం చేశానో నా ప్రజలకు తెలుసు .సీఎం రేవంత్ సర్టిఫికెట్ నాకు అక్కరేలేదు .కేసీఆర్ మీద నా మీద పడి ఏడిస్తే ఏం లాభం.చిన్నారెడ్డి తనకు ఆదర్శం అన్న సీఎం మరి ఆయన డబ్బులిచ్చి టికెట్ తెచుకున్నారన్న ఆరోపణలకు బదులివ్వరా ?.ప్రభుత్వ నిదులతో సభ పెట్టి రాజకీయ విమర్శలు చేస్తారా ?జూపల్లి గతం లో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టారు.ఈ సారి మళ్ళీ మా పార్టీ లోకి రావాలనుకున్నా జూపల్లి కి ఎంట్రీ ఉండదు .అత్తగారింటి దగ్గర తాళి కట్టి మళ్ళీ అమ్మగారి ఇంటి దగ్గర తాళి కట్టినట్టు ఉంది సీఎం రేవంత్ రెడ్డి తీరు .కేసీఆర్ చేసిన  పనులకు మళ్లీ శిలాఫలకాలు వేయడానికేనా రేవంత్ కు సీఎం పదవి వచ్చింది .హేతుబద్దత లేకుండా వనపర్తి జిల్లాను ఏర్పాటు చేశారని రేవంత్ గతం లో హేళనగా మాట్లాడారు 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి