రోడ్డుకు ఇరువైపులా పొంచి ఉన్న ప్రమాదాలు..

జల్లే జయరాజు సిఐటియు మండల కార్యదర్శి.

రోడ్డుకు ఇరువైపులా పొంచి ఉన్న ప్రమాదాలు..

లోకల్ గైడ్ తెలంగాణ,కేసముద్రం:  ఆదివారం రోజున కేసముద్రం మున్సిపాలిటీ పరిధి నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు వేసిన డాంబర్ రోడ్డును సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు పరిశీలించిన అనంతరం, మాట్లాడుతూ.. కేసముద్రం మండలo నుండి ఇంటికన్నె ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం డాంబర్ రోడ్డు నిర్మించినారు. కానీ డాంబర్ రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ బావులు ఉన్నాయి. డాంబర్ రోడ్డు పోసి ఇరువైపులా వాల్సు నిర్మించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చే విధంగా ఉందన్నారు. గత నెలలో వెంకటగిరి నుంచి ఇంటికన్నె వెళ్లే రహదారిలో ఇంటికన్నె నివాసి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి రహదారికి ఇరువైపులా బావులు ఉన్నచోటల్లా ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, అదేవిధంగా గోడలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.