పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్!..

పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయ్!..

లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :-  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో హిందీ భాష గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా ప్రభావం చూపిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు తమిళనాడు టీవీకే పార్టీ అధ్యక్షుడు మరియు నటుడు విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఉత్తరాది అహంకారం నుండి ఉత్తరాది నే ఉత్తమం అనే భావన కలిగిందని తెలిపారు. అంతేకాకుండా ఆవిర్భావ సభ అనేది కేవలం జనసేనదే అని... కానీ ఆ సభ జెండా మొత్తం బిజెపి దే అనేలా ఉందని విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంతో మంది కి ఇక్కడ జీవనోపాధిస్తున్నామని విజయ్ తెలిపారు.  ఇతర భాషలపై ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుందని అలా అని ఆ భాషని   మాపై రుద్దడం మంచిది కాదని విజయ్ తమ అభిప్రాయాన్ని వెల్లడించాడు. మన తమిళ మరియు తెలుగు,మలయాళ భాషలను ఆయా హిందీ భాషలో ఉన్న రాష్ట్రంలో మూడో భాషగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. images (9)

Tags: Vijay

About The Author

Post Comment

Comment List

Latest News