ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు!... కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం?
లోకల్ గైడ్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. తాజాగా 11వేల కోట్ల రుణంతో కీలక ఒప్పొందాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ హడ్కో - సిఆర్డిఏ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణాలకు హడ్కో ఏకంగా 11 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. ఇక జనవరి 22న జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకరించింది. అయితే ఆ నిధుల మంజూరుకు నేడు ఒప్పందం జరిగింది. దీంతో త్వరలోనే అమరావతి పనులను వేగవంతం చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, హట్కో సిఎండి సంజయ్ కుల్ శ్రేష్ట తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదగా రాజధాని అమరావతి పనులు పున ప్రారంభం కానున్నాయని అధికారులు తెలియజేశారు.
Comment List