విద్యార్థినిలు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలి.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

విద్యార్థినిలు బాగా చదివి ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలి.

లోకల్ గైడ్:  

విద్యార్థినిలు బాగా చదివి  ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సైకిళ్ల వితరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అయితే విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలకు వెళ్లేందుకు ఇది మంచి సౌకర్యమని అన్నారు.  అన్ని సబ్జెక్టులు బాగా చదువుకొని సమాజంలో మంచి స్థానంలో నిలవాలని, ముఖ్యంగా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. ఆర్ పి రోడ్ బాలికల ఉన్నత పాఠశాల, బోయవాడ రామగిరి గర్ల్స్  స్కూల్, మల్లెబోల్లి పాఠశాల లోని 30 మంది విద్యార్థినిలకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే ఆర్థిక సహాయం కోసం స్వయం ఉపాధి నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న నకిరేకల్ కు చెందిన సరితకు పేపర్  ప్లేట్ల యూనిట్ ఏర్పాటుకు లక్ష  90 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పీఎంఈజీపీ కింద అందించారు. ఐటిపాముల బ్యాంకు ద్వారా వెంకన్న, మణెమ్మ అనే ఇద్దరు రైతులకు 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు హార్వెస్టర్ లను అందజేశారు .ఐటిపాముల బ్యాంకు ద్వారా 8 స్వయం సహాయకు మహిళా సంఘాలకు బ్యాంకి లింకేజీ కింద కోటి 50 లక్షల రూపాయల విలువైన చెక్కులను, బి సి బాలికల ,మైనార్టీ హాస్టల్ విద్యార్థినిలకు 20 శానిటరీ నాప్కిన్ ఇన్ఫినేటర్లను అందజేశారు. దీంతోపాటు,అడవిదేవులపల్లి , షేర్ బౌలి అంగన్వాడి కేంద్రాలను, అలాగే మహాలక్ష్మి వృద్ధాశ్రమాల ఆధునికీకరణ, మిర్యాలగూడ,ఐటిపాముల   ఎస్టి గర్ల్స్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సి ఎస్ ఆర్ నిధుల ద్వారా  చేపట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం వినోద్ కుమార్ సిన్హా, రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, చీఫ్ మేనేజర్ ఆంజనేయులు,  జిల్లా ఎల్డీఎం శ్రామిక్, ఏపీ డి శారద ,ఎంఈఓ అరుంధతి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి  నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 
  లోకల్ గైడ్ తెలంగాణ , వరంగల్ జిల్లా ప్రతినిధి : నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు లో ఓ వెంచర్ దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమి మాది
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ "చిన్న జీయర్ స్వామి" వారి ఆశీస్సులు తీసుకున్న అశోక్ సాదుల...
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి ...
దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 
అంగన్వాడి కేంద్రాలకు ఒక్కపూట బడులు అమలుచేయాలి
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి