శీనన్న సెల్ఫ్ షి"కారు"
క్యాంప్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఫార్చ్యూనర్ నడిపిన మినిస్టర్ పొంగులేటి
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ:ఖమ్మం :మంత్రి పొంగులేటి శీనన్న ఖమ్మంలో షి"కారు" చేశారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నూతనంగా కొనుగోలు చేసిన ఫార్చ్యూనర్ కారును ఆదివారం ఉదయం పొంగులేటి ఆవిష్కరించారు. అనంతరం ఆ కారును స్టార్ట్ చేసిన మంత్రి సరదాగా నడుపుతూ ఎన్టీఆర్ సర్కిల్ వరకు వచ్చారు. పొంగులేటిని అనుసరిస్తూ ఆయన కాన్వాయ్ వెనకనే వచ్చింది. కారు దిగాక పాయంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నుంచి తన కాన్వాయ్ లో ఇల్లందు పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Mar 2025 14:36:48
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
Comment List