టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు వింత నిరసన
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు విచిత్రమైన నిరసనలు తెలిపారు. శాసన మండలి ఎదుటనే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూతనమైన నిరసనను తాజాగా చేపట్టారు. మిర్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మహమూద్ అలీ, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మధుసూదనాచారి మెడలో ఎండుమిర్చి ల మాలలను ధరించి నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్చి పంటను పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక లబోదిబోమని వేడుకుంటున్నా కూడా ప్రభుత్వానికి కనీస కనికరం లేదంటూ నిరసనలు చేపట్టారు. వెంటనే మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. కాగా ఈ సీజన్లో మిర్చి పంట సాగు నాలుగు లక్షల ఎకరాల నుంచి 1.6 లక్షల ఎకరాలకు పడిపోయిందని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి మిర్చి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. లేదంటే ఇలాంటి నిరసనలను ఎన్నో చేస్తామని హెచ్చరించారు.
Comment List