ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట

లోకల్ గైడ్ తెలంగాణ:ఇల్లందు:

ఇందిరమ్మ ప్రభుత్వంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇల్లందు పట్టణం జేకే కాలనీలో కొత్తగా మంజూరైన 100పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలించి పేదలకు ఎటువంటి న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే చూసి ఓర్వలేక కాకిగోల చేస్తుందని తెలిపారు. వారి విమర్శలు తిప్పికొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఇల్లందులో రూ.35కోట్లతో 100పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంఖుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా 58నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి రూ.200కోట్ల చొప్పున మొత్తం 11,600కోట్లను కేటాయించుకోని ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని నియోజకర్గాల్లోనూ ఈ స్కూల్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.