ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలి. డిపిఒ శ్రీనివాస్
లోకల్ గైడ్ తెలంగాణ
ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరిం చాలని డీపీఓ శ్రీనివాస్ అన్నారు.శనివారం మండలంలోని చించోలి(బి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.మహిళా దినోత్సవం సందర్బంగా డ్వాక్రా మహిళల సంఘల సహకారంతో స్టీల్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను నివారించారు .గ్రామాల్లో ఎచిన్న ఫ్యాంక్షన్ చేసుకున్న ప్ల్సాటిన్ గ్లాసులు ,ప్లెట్స్ బ్యాగులు వంటివి వాడకుండా..గ్రామంలోని స్టీల్ బ్యాంక్ ను సద్వినియోగం చేసికొని ప్లాస్టిక్ ని నిషేధించాలని సూచించారు.ముందుగా గ్రామంలోని పంచాయతీ మహిళా కార్మికులను,అంగన్ వాడి టీచర్లను, మహిళా సంఘాల సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ అజీజ్ ఖాన్ మహిళా సంఘా సభ్యులు గ్రామస్థులు రమేష్,శంకర్ అంగన్వాడీ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు .
Comment List