బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!..

హర్ష సాయిపై కేసు నమోదు

బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బెట్టింగ్ ప్రమోటర్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నేరుగా ఆర్టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.  అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలలో బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ లకు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అలాగే ఆర్టిసి ఎండి సజ్జనార్ వీరిద్దరూ కూడా వార్నింగ్ లు ఇచ్చారు. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు నష్టపోతున్నారని, అంతేకాకుండా వీటిని నమ్మి చాలా మంది డబ్బులు పోగొట్టుకొని చివరికి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సత్యనారాయణ తెలిపారు. కాబట్టి వీళ్ళని నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని ప్రజలకు సూచించారు.  అయితే ఇవన్నీ నేను వ్యక్తిగతంగా చేయట్లేదని.. కేవలం ఇలాంటి వారి వల్ల ప్రజలు ఎవరూ నష్టపోకూడదని ఇలా చేస్తున్నానని సజ్జనార్ తెలిపారు.  తాజాగా   ఒక ఇంటర్వ్యూలో హర్ష సాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుంటే వేరే వాళ్ళు చేస్తారు. అదేదో నేనే చేసి images (6) నాకు వచ్చిన డబ్బులను తిరిగి  మళ్ళీ ప్రజలకు పంచి పెడుతున్నాను కదా.. అని హర్ష సాయి చెప్పుకొచ్చారు. ఏడాదికి 100 కోట్ల నుండి 500 కోట్ల వరకు డబ్బులును ఇస్తామన్నా మేము తీసుకోవట్లేదని తెలిపారు. కాబట్టి ఎవరో చేయడం కన్నా నేనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఆ డబ్బులను తిరిగి మళ్ళీ ప్రజలకు ఉపయోగిస్తాను అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాళ్ల వల్ల అమాయక ప్రజలు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాబట్టి ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని అన్నారు. వెంటనే సోషల్ మీడియా లో ఇలాంటి బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్లను ఫాలో చేయండి అని యువకులకు సత్యనారాయణ సూచించారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News