1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్‌..

1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్‌..

లోకల్ గైడ్:

ఐదు నెలల్లోనే రెండో రౌండ్‌ లేఆఫ్స్‌  ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌  మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.ప్రముఖ విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది.నష్టనివారణ చర్యల్లో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది సంస్థ ఖర్చులను తగ్గించి,నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తున్నట్లు మీడియా కథనాలు నివేదిస్తున్నాయి.ప్రొక్యూర్‌మెంట్‌,కస్టమర్ రిలేషన్స్‌,ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు వార్తల తర్వాత ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు కూడా 5 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది.దాదాపు ఐదు నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్‌లో ఇది రెండో రౌండ్‌ తొలగింపులు. గతేడాది నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే .ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది. 

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.