16న మహిళా దినోత్సవ వేడుకలు
జర్నలిజం-మహిళలు-సవాళ్ళు అంశంపై సెమినార్
సీనియర్ మహిళా జర్నలిస్టులకు సన్మానం
లోకల్ గైడ్ హైదరాబాద్, ప్రతినిధి:
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్),హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూజే) సంయుక్తాధ్వర్యంలో ఈనెల 16వ తేదీ ఆదివారం చిక్కడపల్లి లోని త్యాగరాయగాన సభలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవపున్నయ్య, హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి.అరుణ్ కుమార్, బి.జగదీశ్వర్ లు తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఓయూ జర్నలిజం శాఖ రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా,ఎన్డీ టీవీ తెలుగు రాష్ట్రాల ఇన్చార్జ్ ఉమా సుధీర్, విశిష్ట అతిథులుగా సీనియర్ జర్నలిస్టు ప్రియా చౌదరి, స్వతంత్ర జర్నలిస్టు తులసీచందు,టీ న్యూస్ సీనియర్ జర్నలిస్టు స్వేచ్ఛ, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కే సలీమా తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భాగంగా "జర్నలిజం-మహిళలు-సవాళ్ళు"అన్న అంశంపై సెమినార్ ఉంటుందన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. రాధిక అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. నాగవాణి, పి. విజయ, మణిమాల, రోజారాణి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని, ఈ సందర్భంగా వివిధ పత్రికలు, టీవీ చానళ్ళలో పనిచేస్తున్న సీనియర్ మహిళా జర్నలిస్టులకు ఆత్మీయ సత్కారం ఉంటుందని తెలిపారు.
Comment List