ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి  

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండవ రోజు ప్రారంభించిన నిరవధిక దీక్షలు.

ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 ఫలితాలను విడుదల చేయాలి  

చింత వినయ్ బాబు

లోకల్ గైడ్ .. నల్లగొండ


పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం సూర్యాపేట టౌన్ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న ఆధ్వర్యంలో రెండో రోజు నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా   ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణలో వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని, అలాగే గత ఉద్యోగ నోటిఫికేషన్ల కు ఆర్డినెన్సును తీసుకొచ్చి అమలు చేస్తామని మాట తప్పారని, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలని, గ్రూప్స్ 1, 2 ,3 పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తే ఎస్సీ  58 కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరవధిక దీక్షలు ప్రారంభించుకోవడం జరిగింది.ఈ సమావేశం లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ, ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు బోడ శ్రీరాములు మాదిగ, సూర్యాపేట మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ సీనియర్ నాయకులు జానయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పరడిదల సోమయ్య మాదిగ, సూర్యాపేట రూరల్ ఎంఎస్పి అధ్యక్షులు పంతం లింగయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇరుగు దానయ్య మాదిగ,  ఇరుగు కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పంతం నరసయ్య మాదిగ, కొంగర లక్ష్మక్క మాదిగ లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ మాదిగ, పోలీస్ రిటైర్మెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, వల్దాస్ ఏడుకొండలు,  పరమేష్ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?