మైనింగ్ రంగంలో మహిళా శక్తికి అరుదైన గౌరవం

మైనింగ్ రంగంలో మహిళా శక్తికి అరుదైన గౌరవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మైనింగ్ లో సత్తా చాటిన అతివలకు సన్మానం

హాజరైన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి

 రాష్ట్ర స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 

కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే

పాల్గొన్న సింగరేణి సంస్థ సీఎండి ఎన్. బలరామ్

సింగరేణి భవన్ (లోకల్ గైడ్ )
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బొగ్గు గనుల్లో పనిచేస్తూ ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఉత్తమ మహిళా ఉద్యోగులు, అధికారులను హైదరాబాద్లో గురువారం కేంద్ర  బొగ్గు,  గనుల శాఖ మంత్రి  జి .కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల  శాఖ సహాయ మంత్రి  సతీష్ చంద్ర దూబే , తెలంగాణ రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి  ధనసరి  అనసూయ (సీతక్క ), సింగరేణి సీఎండీ  ఎన్.బలరామ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో సింగరేణి సంస్థలో మైనింగ్ అధికారులుగా భూ గర్భ గనుల్లో విధులు నిర్వర్తిస్తున్న మైనింగ్ అధికారులు అంబటి మౌనిక (పీవీకే 5 ఇంక్లైన్), అల్లం నవ్య శ్రీ(జీడీకే 11 ఇంక్లైన్)లను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా  అంకిత భావంతో పనిచేస్తున్న మహిళా అధికారులను  సీఎండీ  ఎన్.బలరామ్  ప్రశంసించారు. భవిష్యత్ లో సింగరేణి  లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి