క్రీడల పోటీలు... యువకుల్లో ఐక్యతను పెంచుతాయి..
సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్
లోకల్ గైడ్ :క్రీడల పోటీలు వల్ల యువకులో ఐక్యతను చాటుతాయని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ అన్నారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో మహబూబ్ నగర్ బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టీం విజేతలకు కప్ లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ బోయపల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు.క్రీడలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతాయని, నేటితరం యువకులు, బాల బాలికలు చదువుతోపాటు తమకిష్టమైన క్రీడారంగంలో రాణించాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అందుకు గ్రామస్తుల సహకారం కూడా ఉండాలని అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ నాయక్, కొల్లూరు రాజు నాయక్, రఘు నాయక్, డిజె శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List