షాద్ నగర్ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన: మంత్రి సీతక్క
By Ram Reddy
On
లోకల్ గైడ్:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఫరూఖ్ నగర్ మండలం లోని మదురాపూర్ గ్రామం లో 8 కోట్ల వ్యయంతో వేయనున్న బిటి రోడ్డు పనులతో పాటు, 50 లక్షలతో నిర్మించిన జనరల్ కమ్యూనిటీ హాల్, మహిళా సమాఖ్య బిల్డింగ్ లను మంత్రి సీతక్క ప్రారంభించారు.అనంతరం మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాల చెక్కు లను పంపిణీ చేశారు. నందిగామ మండలం లో 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట షాద్ నగర్, కల్వకుర్తి ఎంఎల్ఏ లు విర్లపల్లీ శంకర్,కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Tags:
Comment List