తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 

 తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 

లోక‌ల్ గైడ్: హెచ్‌ఐసీసీ వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు రెండో రోజూ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్వోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించగా.. తెలుగు ప్రముఖులు, సినిమా కళాకారులు, సాహితీవేత్తలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకూ హైదరాబాద్‌ వేదికగా మహాసభలు జరగనున్నాయి. నేడు జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు."ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగువారి అందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష. ఈ భాష గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా తేటతేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా అని పాడుతాం. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మధురమైన భాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్సా అని కృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. ప్రాచీన తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవం ఇచ్చింది. తెలుగు భాషను ఎంతో మంది మహానుభావులు కొంతపుంతలు తొక్కించారు. నిజాం కాలంలో మన భాష అణగదొక్కబడింది. అప్పట్లో ఆంధ్ర మహాసభలు నిర్వహించి నిర్బంధాలను దాటారు. కొంతమంది తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారని" అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News