ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
-----------------------------------------
కొవ్వత్తిలా నిత్యం కరిగిపోతూ
చాలీచాలని జీతంతో జీవిస్తూ
ఎలాంటి గుర్తింపు లేక జీవనం సాగిస్తూ
కష్టాల కడలిలో నిత్యం మునిగిపోతూ
కుటుంబ పోషణనే భారంగా జీవిస్తూ...
ఆజ్ఞలను ఆక్షేపాలను భరిస్తూ
కష్టాల నావలో ప్రయాణం సాగిస్తూ
ఉత్తమ శ్రమకు ఫలితము పొందలేక
ప్రైవేటు రంగంలో నలిగిపోతూ
కన్నీళ్లను కష్టాలను భరిస్తూ
చదువు సాగరంలో మునిగిపోతూ
అవహేళనలు అవమానాలు భరిస్తూ...
ప్రైవేటు సంస్థలో పనిచేసే ఓ గురువా!!
నీ నిజాయితీకి గుర్తింపు ఎక్కడ?
సత్కారాలు సన్మానాలకు దూరమై
చిత్కారాలను చివాట్లను భరిస్తూ
ఉత్తమ బోధనకు ఫలితం పొందలేక...
అనుక్షణం ధర్మంగా విద్యను బోధిస్తూ
జీవితాన్ని సాదాసీదగా సాగిస్తూ
ప్రేమకు ఆప్యాయతకు దూరమై
మనోవేదనతో మౌనంగా సాగిపోతూ
ప్రభుత్వ పరంగా గుర్తింపు దక్కక
నలిగిపోతున్న ఓ ప్రవేట్ మాస్టారూ
ఈ సమాజంలో నీ స్థానం ఎక్కడ...
వి.జానకి రాములు గౌడ్
లింగంధన
Comment List