వంగూరి వాచకం -నవరత్నాలు
By Ram Reddy
On
లోకల్ గైడ్ :
వంగూరి వాచకం -నవరత్నాలు
1.మౌనం వీడి
మాటలు కలుపు
మనసు మురిసి
మమతలు నిలుపు
2.పట్టువిడుపులతో
సంసారమే ఓ నందనవనం
పట్టింపులతో
సంసారమే ఓ అశోకవనం
3.మానవ జీవితం
ఆశించేది మార్పు
మంచి విషయ
పుస్తకం అది నేర్పు
4.గురిపెట్టి మన బలహీనతలకు
వేస్తారు సైబర్ ట్రాప్
పసిగట్టి పడకపోతే జాగ్రత్త
చూస్తావు బ్యాలెన్స జీరో
5.ఇద్దరూ కొట్టుకుంటుంటే
చూసిన వారంటారు తప్పు
చక్కగ కొట్టుకోక పోతే
చూసిన వైద్యుడంటాడు ముప్పు
6.ఉన్నత లక్ష్యం చేరాలంటే
ఉండాలి కాస్త అణగి
ఎత్తైన పర్వతం ఎక్కాలంటే
నడవాలి కాస్త ఒరగి
7.వెలిగిపోతున్నానని
మురువకు
చమురున్నంతవరకేనని
మరువకు
8.ఆకాశానికి నిచ్చెన
వేస్తున్న ఇండ్లు
పాతాళంలో పడక
వేస్తున్న నీళ్లు
9. చేయాలంటే
దొరికేను కదా తీరిక
వద్దనుకుంటే
సాకులకు కరువే లేదిక
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
ఆదిలాబాద్ పార్లమెంటరీ మీటింగ్ హాజరైన....
07 Jan 2025 13:44:44
లోకల్ గైడ్: ఆదిలాబాద్ పార్లమెంటరీ మీటింగ్ కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్...
Comment List