ఎంపీ వద్దిరాజు దివంగత ఉప ప్రధాని జగ్జీవన్ రాంకు ఘన నివాళులు

ఎంపీ వద్దిరాజు దివంగత ఉప ప్రధాని జగ్జీవన్ రాంకు ఘన నివాళులు

లోక‌ల్ గైడ్ :దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఘనంగా నివాళులర్పించారు.అంటరానితనం, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా జీవితాంతం పోరాడిన సామాజిక విప్లవకారుడు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వతేదీన బీహార్ రాష్ట్రంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి అంచెలంచెలుగా ఉప ప్రధాని స్థాయికి ఎదిగారని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన జాతీయోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడిన యోధుడని ఎంపీ రవిచంద్ర కొనియాడారు.చట్టసభల సభ్యుడిగా 50 ఏండ్ల సుదీర్ఘ కాలం కొనసాగి ప్రపంచ రికార్డు సృష్టించిన మహానేత జగ్జీవన్ రామ్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా,ఉప ప్రధానిగా, రక్షణ, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్, వ్యవసాయ,ఆహార, కార్మిక,ఉపాధి శాఖల మంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించారని ఎంపీ వద్దిరాజు ప్రస్తుతించారు.ఆ మహనీయుడి స్పూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎస్సీల సముద్ధరణకు పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని, విదేశాలలో ఉన్నత కోర్సులు చదువుకోవాలనే యువతకు 20 లక్షల చొప్పున,దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి 10లక్షల చొప్పున ఉచితంగా సాయమందజేశారని ఎంపీ రవిచంద్ర వివరించారు.జగ్జీవన్ రామ్ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి  స్వయంగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవిత  చరిత్రను చదివి ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని యువతకు ఎంపీ రవిచంద్ర హితోపదేశం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్