తెలంగాణ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి )
నల్లగొండ జిల్లా 7 వ మహాసభ ను జయప్రదం చేయండి: ఏఐటియుసి
లోకల్ గైడ్:
భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఏడవ మహాసభ జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి, కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.శుక్రవారం ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలునిర్వహించి 1996లో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని తీసుకురావడం కోసం కృషి చేయటం జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేయించడం కోసం ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. నిజమైన కార్మికులు సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకునే విధంగా లేబర్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల బోగస్ కార్మికులకు కూడా లేబర్ కార్డు తీసుకొని లబ్ధి పొందుతున్నారు. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత పనిచేసే కార్మికులకు తంబూ పడక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున తంబూ విధానం రద్దు చేసేందుకు పోరాటం నిర్వహించాలి. బోగస్ కార్డులు మొత్తం ఏరి వేయాలి .సంక్షేమ బోర్డులో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి కార్మికులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కాన్పులకు, పెళ్లిళ్లకు, సహజ మరణానికి, ప్రమాదం మరణానికి ఇస్తున్న డబ్బులు పెరిగిన ధరలదృష్ట ఏమాత్రం సరిపోవటం లేదని వాటిని రెట్టింపు చేయాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తుంది అన్నారు. 50 సంవత్సరాలు దాటిన భవనిర్మాణ కార్మికులకు నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కార్మికుల అడ్డాల వద్ద షెల్టర్ నిర్మించి మంచినీరు, బాత్రూం సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ చట్టాల వల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంక్షేమ బోర్డుని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. హక్కుల సాధన కోసం కార్మికులు పోరాటాల్లో పాల్గొనాలీ ఈ రంగం లో పనిచేస్తున్న వేలాది మంది భవన నిర్మాణ కార్మికులకు పెరిగిన ముడి సరుకుల ధరల వల్ల పనులు దొరకక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. దరఖాస్తు చేసుకున్న కార్మికులకు వెంటనే కొత్త కార్డు లు ఇవ్వాలి, క్లెయిమ్ ల డబ్బులు మంజూరు చేయాలనీ. ఆన్లైన్ పొరపాటు వల్ల చాలా తప్పులు దొర్లుతున్నాయని ,ఆధార్ అప్డేట్ల కోసం రెన్యువల్స్ కోసం రోజుల తరబడి కార్మికులు లేబర్ కార్యాలయాల చుట్టు తిరిగిన పనులు కావడం లేదు అనీ విమర్శించారు.. కావున భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరగబోయే పోరాటాల గురించీ ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది అన్నారు. ఏప్రిల్ 14,శనివారం నల్లగొండ ( ఎస్ వి ఆర్ ఫంక్షన్ హాల్ మిర్యాలగూడ రోడ్ )లో జిల్లా 7 వ మహాసభ జరుగుతుంది అని వెల్లడించారు. కావున జిల్లాలోని భవన మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కేఎస్ రెడ్డి, పానం వెంకట్ రాములు, జిల్లా నాయకులు సకినాల అంజయ్య,పట్టణ అధ్యక్షులు గుండె రవి, పట్టణ కార్యదర్శి రెవల్లి యాదయ్య, కోశాధికారి గోపగానీ నరసింహ నాయకులు గుల్లి నరేందర్,వెంకన్న నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comment List