ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి
లోకల్ గైడ్ ;దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాలు వివిధ పార్టీల నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో అశోక్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ లు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం రైతాంగ పోరాటం చేసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నల్లగొండ జిల్లా వాసి అన్నారు .ఇప్పుడు జనగామ జిల్లాలు జన్మస్థలం, వారు తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత కావడం గర్వకారణంగా ఉందని అన్నారు.
దడ్డు కొమురయ్య జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎల్వి యాదవ్ బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య గారి జయంతిని అధికారికంగా నిర్వహించడం అర్షనీయమే కానీ దాన్ని నాన్ మాత్రం చేయడం ఇది సబబు కాదు ఇప్పటికైనా ఇకనుంచి ఇలాంటి తప్పిదాలు చేయకూడదని ఇకనుంచి ప్రభుత్వాలు కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు వారు మార్గదర్శకులుగా ఈ తెలంగాణకు దిక్సూచిగా ఉన్నటువంటి వారి జయంతి నీ నామ్ మాత్రం చేయడం ఇది సరైన పద్ధతి కాదు అనడం జరిగింది ఈ కార్యక్రమంలో బిసి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ బీసీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్ జిల్లాయువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Comment List