తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో నిన్న భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వర్షం నిరంతరం పడుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులో 13.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపూర్ లో 10.8 సెంటీమీటర్ల, హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో 9.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయిందని అధికారులు పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం తో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఎటు చూసినా కూడా నీరు రోడ్లపై పారుతూనే ఉంది. రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులు కూడా నీటి దెబ్బకి కష్టాలను ఎదుర్కొన్నారు. నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని జిల్లాలలో కరెంటుకు అంతరాయం కలగగా మరికొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు నమోదవడంతో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు.
Comment List