300 కాదు కదా... అందులో సగం కూడా కష్టమే!... SRH టీం పై ట్రోల్ల్స్
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- గత సంవత్సరం ఐపీఎల్ లో SRH టీం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే ఎస్ ఆర్ హెచ్ జట్టులోని ప్లేయర్స్ అందరూ కూడా భారీ హిటర్స్. గత సంవత్సరం ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 300 లోడింగ్... 250 లోడింగ్ అంటూ దాదాపు మూడుసార్లు 250 కి పైగా పురుగులు చేశారు. దీంతో SRH జట్టుకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ ఈ సంవత్సరం మాత్రం 300 కాదు కదా... కనీసం అందులో సగమైన కొట్టండి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం లెక్క హైదరాబాద్ జట్టు ఈ సంవత్సరం అంతగా అనిపించలేదు. ఈ 18వ సీజన్ ఐపీఎల్ ప్రారంభమైన మొదటి మ్యాచ్ లోనే హైదరాబాద్ జట్టు ఏకంగా 286 పరుగులు చేసి మిగతా టీం మెంబెర్స్ నే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని కూడా కదిలించింది. అయితే ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ల్లో గోరపరాజయాన్ని పొంది... ఫ్యాన్స్ నుండి విపరీతంగా ట్రోల్స్ ని ఎదుర్కొంటుంది. దానికి కారణము గత సీజన్ లో భారీగా విడుచుకుపడిన ఓపినర్స్ ట్రావెస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఈసారి ఘోరంగా విఫలమవుతున్నారు. గత సంవత్సరంలో వీళ్ళిద్దరూ ఓపినర్సుగా మొదటి వికెట్ నష్టానికి 120 లేదా 100 పరుగులైన కనీసం చేసేవారు. ఇక పవర్ ప్లే లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవర్ ప్లే లోనే 80 పరుగులకు పైగా చేసేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మొదటి రెండు మూడు ఓవర్లలోనే అవుట్ అవుతున్నారు. ఎంతో తర్వాత వచ్చే బ్యాట్స్మెన్లు అందరూ కూడా విఫలమవుతున్నారు. దీంతో ఈసారి 300 కాదు గాని అందులో సగం 150 లేదా 200 పరుగులు చేయండి అని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
Comment List