అక్రమ అరెస్టులకు బెదరం రేవంత్ రెడ్డి కబర్దార్….

తెరాస అప్పులు చేసింది – కాంగ్రెస్ భూములు అమ్ముతోంది..!

అక్రమ అరెస్టులకు బెదరం రేవంత్ రెడ్డి కబర్దార్….

ప్రభుత్వ భూములు అమ్మితే భవిష్యత్ తరాలకు ఏం మిగులుతుంది?

HCU 400 ఎకరాల భూమి అమ్మకం పై ప్రభుత్వం పునరాలోచించాలి..

పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు…

లోకల్ గైడ్ న్యూస్:

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన తెరాస, ఇప్పుడు ఆ అప్పులను తీర్చలేక ప్రభుత్వ భూములను అమ్మే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. (HCU) 400 ఎకరాల భూమి అమ్మకం ఇందుకు తాజా ఉదాహరణ. సిగ్గులేకుండా ప్రభుత్వ భూములను అమ్ముతూ ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం బాధాకరం అందులో భాగంగా ఈరోజు బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ని ఇంటిదగ్గర అరెస్టు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రశాంత్ ముదిరాజ్  మాట్లాడుతూ “తెరాస ప్రభుత్వం పదేళ్ల పాలనతో పాటు వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది. కానీ, అవి అభివృద్ధికి కాకుండా అవినీతి, అక్రమ ఖర్చులకు దారి తీశాయి. ఇప్పుడు ఆ అప్పుల భారం తట్టుకోలేక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తోంది. ప్రజల ఆస్తులను తాకట్టుపెట్టి, భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కుట్ర జరుగుతోంది.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పులు ఎందుకు తెచ్చారు?

1. తెరాస అనాలోచితంగా అప్పులు చేసింది-ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు అప్పు చేసి అవినీతికి పాల్పడ్డారు.మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాల పేరుతో నిధులను దుర్వినియోగం చేశారు.
2. ⁠ఉచిత పథకాలు – ప్లానింగ్ లేకుండా, అప్పులపైనే నడిపారు-రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రజలకు తాత్కాలిక మేలు కలిగించినా, దీని వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో పడిపోయింది..
3. ⁠పదేళ్ల తెరాస పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ! తెరాస హయాంలో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు.రెవెన్యూ ఆదాయాన్ని పెంచే దారులు వెతకకుండా, అప్పులపైనే ఆధారపడ్డారు..
4.ఇప్పుడు కాంగ్రెస్ భూముల అమ్మకానికి తెరతీసింది-తెరాస అప్పులు చేసింది – కాంగ్రెస్ వాటిని తీర్చలేక భూములు అమ్ముతోంది! ,HCU 400 ఎకరాల భూమిని అమ్మి విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టేందుకు సిద్ధమైంది.ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తును కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ప్రజలు మేల్కొనాలీ తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మే కుట్రను తక్షణమే నిలిపివేయాలని బీసీ సేన డిమాండ్ చేస్తోంది. ప్రజల హక్కులను, భవిష్యత్తును కాపాడుకోవడానికి అన్ని విధాలుగా పోరాటం చేయనున్నట్లు హెచ్చరిస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News