చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ధోనీ...
లోకల్ గైడ్:
ఐపీఎల్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం.. చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్‌కు గాయం కావడంతో.. కెప్టెన్సీ పాత్రను ధోనీ పోషిస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గాయపడ్డాడు. తుషార్ పాండే బౌలింగ్‌లో అతని మోచేతికి బలంగా బంతి తగిలింది. దీంతో రుతురాజ్ తీవ్ర ఇబ్బందిపడ్డాడు.అయితే ఇవాళ్టి మ్యాచ్ కోసం గైక్వాడ్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను గైర్హాజరు అయితే, అతని స్థానంలో ధోనీ సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గైక్వాడ్ స్థానంలో బ్యాటర్‌గా డేవాన్ కాన్వే బరిలోకి దిగే ఛాన్సు ఉన్నది. శుక్రవారం నెట్స్‌లో అతను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఓపెనర్‌గా కాన్వే ఆడే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ త్రిపాఠీతో అతను ఓపెనింగ్ వచ్చే ఛాన్సు ఉన్నది. రచిన్ రవీంద్రను మూడవ స్థానంలో ఆడించనున్నారు. జేమీ ఓవర్‌టన్‌ను పక్కన పెట్టి ఈ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను ఆడించనున్నారు.
Comment List