తెలంగాణలో అకడమిక్ క్యాలెండర్ విడుదల!..
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కాలేజీలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదలయ్యింది. 2025- 26 కు సంబంధించి క్యాలెండర్ ను అధికారికంగా అధికారులు వెల్లడించారు. ఈ క్యాలెండర్ లో భాగంగా జూన్ రెండు నుంచి కాలేజీలు ప్రారంభం కానున్నాయి. అలాగే సంవత్సరం మొత్తంలో 226 రోజుల పని దినాలు ఉండునున్నాయి. ఇక సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే 2026వ సంవత్సరంలో జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాలెండర్ పరంగానే నడుచుకోవాలని తెలిపారు. అలాగే జనవరి లాస్ట్ వీక్ లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారంలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయని... కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవి గమనించాలని అధికారులు కోరారు. మార్చి 31వ తేదీన చివరి వర్కింగ్ డే గా క్యాలెండర్లో నిర్ణయించబడింది. కాబట్టి కాలేజీలకు వెళ్లేటువంటివి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ క్యాలెండర్ ను అనుసరించాలని అధికారులు వెల్లడించారు.
Comment List