జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి

జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి

కామారెడ్డి : కేంద్ర మాజీ మంత్రి , స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 5, 1908 లో బీహార్ రాష్ట్రం లోని భోకపూర్ జిల్లా చంద్వా గ్రామంలో శోభి రామ్ వాసంతి పుణ్య దంపతులకు జన్మించారని తెలిపారు. ఆయన జీవితం రాజకీయంగా వృద్ధి చెందిందని, క్విట్ ఇండియా పోరాటం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు. 1952-56 సమాచార మంత్రిత్వ శాఖ, 1956-62 లో రైల్వే మంత్రిత్వ శాఖ, 1962-63 లో రవాణా, కమ్యూనికేషన్ శాఖలు నిర్వహించారని తెలిపారు. 1967-70 కాలంలో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా హరిత విప్లవానికి నాంది పలికారని తెలిపారు. 40 సంవత్సరాలు పార్లమెంట్రియన్ గా, 10 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా పనిచేశారని తెలిపారు. 
      రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీ లకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యువత, అర్హులైన వారు యూనిట్ల స్థాపనకు ఈ నెల 14 లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు . గత నాలుగు నెలల క్రితం ప్రభుత్వం వసతి గృహాల మేనూ 40 శాతం పెంచిందని, తద్వారా మంచి భోజనం విద్యార్థులకు అందజేయడం జరుగుతున్నదని కలెక్టర్ తెలిపారు.  ప్రతి ఇన్స్టిట్యూట్ కు ఒక అధికారిని నియమించడం జరిగిందని, విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించి నివేదికలు సమర్పించడం జరుగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుచున్నదని, జిల్లాలో 60 శాతం పంపిణీ జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డి మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ ఎంపీగా, ఉప ప్రధానిగా పనిచేశారని, రాజకీయంగా ఉన్నతిదయ్యాడని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో శాఖ గ్రంథాలయాలు పనిచేస్తున్నాయని, యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు పలువురు పలు సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, ఆర్డీఓ వీణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్