తెలంగాణా బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాగడాల ప్రదర్శన..

తెలంగాణా బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో కాగడాల ప్రదర్శన..

విద్యార్థులకు అండగా తెలంగాణ బీజేవైఎం...

బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్...

లోకల్ గైడ్  - షాద్ నగర్ :

HCU లోని మూగజీవుల అరణ్య రోదనకు మద్దతుగా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ కి వ్యతిరేకంగా తెలంగాణా BJYM అధ్యక్షులు సెవెళ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఈరోజు ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం నుండి కొమురం భీంవిగ్రహం వరకు జల్ జంగల్ జమీన్ ఉద్యమ స్ఫూర్తితో  సంతకాల సేకరణ కాగడాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమం లో బీజేవైఎం  జిల్లా నాయకులు మల్లేష్ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు వివేక్ ప్రధాన కార్యదర్శి అభిలాష్ రాము, శ్రీకాంత్ BJYM రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్యాట అశోక్  మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు యువత ఆత్మ బలిదాణమై తెచ్చుకున్న తెలంగాణలో దొరల పాలన కొనసాగుతుందని అన్నారు.గతంలో పదేళ్ళు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటూ మాయమాటలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత విద్యార్థులను ప్రజలను రైతులను మోసం చేసారని అన్నారు. నిరుద్యోగ యువతకు విద్యార్థులకు అండగా ఎప్పుడూ బీజేవైఎం ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ విద్యార్థులు, జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు సామాజిక ఉద్యమకారులు సామాజిక తత్వవేత్తలు మేధావులు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
కామారెడ్డి : కేంద్ర మాజీ మంత్రి , స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్...
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దు
ఎంపీ వద్దిరాజు దివంగత ఉప ప్రధాని జగ్జీవన్ రాంకు ఘన నివాళులు