బంగ్లాదేశ్ నేత యూనుస్‌తో ప్రధాని మోదీ భేటీ
లోకల్ గైడ్ :థాయిల్యాండ్‌లోని బ్యాంగ్‌కాక్‌లో జరుగుతున్న బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఇవాళ ఆయన బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్‌ను కలిశారు. ఆ ఇద్దరూ కరాచలనం చేసుకున్నారు. పలు అంశాలపై మాట్లాడారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తొలగించిన తర్వాత .. యూనుస్‌తో మోదీ భేటీ అయ్యారు. బంగ్లాలో భారతీయ మైనార్టీలపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకున్నది. మరో వైపు ఇటీవల చైనా పర్యటనలో బంగ్లా నేత ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద కామెంట్ చేసిన విషయం తెలిసిందే.బిమ్స్‌టెక్ సభ్య దేశాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. భారత్‌లోని యూపీఐ పేమెంట్ విధానాన్ని.. సభ్య దేశాలతో పంచుకోనున్నట్లు చెప్పారు. దీని ద్వారా వాణిజ్యం, వ్యాపారం, టూరిజం మెరగవనున్నట్లు వెల్లడించారు. బిమ్స్‌టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించుకోవచ్చు అని చెప్పారు. స్థానిక కరెన్సీతో ట్రేడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. మార్చి 28వ తేదీన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు చవిచూసిన మయన్మార్, థాయిలాండ్‌కు మోదీ సంతాపం తెలిపారు.
Comment List