ఎచ్ సీ యూ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి

విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలి

ఎచ్ సీ యూ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలి

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

లోకల్ గైడ్:  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలని, విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్‌ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని సిపిఎం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, హెచ్.సీ. యు భూముల రక్షణ కోసం పోరాడిన వారిని ప్రభుత్వం అరెస్టులు చేసి జైల్లో వేయడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. హెచ్ సి యు గేటు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా సిపిఎం  పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ  అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. ఈ అరెస్టులను అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెరిగిందని వారు విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడమెట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకొని అమ్మకానికి పెట్టిందని ఇప్పటికైనా విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు. ఉన్నట్టుండి నిన్న పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించడాన్ని , ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్‌ స్థలంలో కూడా చదును చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అమ్మొద్దని ప్రశ్నిస్తున్నా విద్యార్థులను అరెస్టు చేయడం, పోలీస్‌ స్టేషన్లల్లో నిర్బంధించారని పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో చేస్తేనే విడుదల చేస్తామని ఒత్తిడి చేయడం ఇది అభ్యంతరకరం, అప్రజాస్వామికమని దీనిని అందరూ ఖండించాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని, 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని, తక్షణం అరెస్టు చేసిన విద్యార్థులను,  సిపిఎం నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, రాజయ్య, మానిక్, నర్సింలు, కృష్ణ, మహేశ్, అర్జున్, పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News