ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ 

 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 

ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ 

లోకల్ గైడ్ :  తెలంగాణలో  ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాత గంజిలోని చౌక ధర దుకాణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు.  ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాలు ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులను మంజూరి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ , డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్