'కాంగ్రెస్ పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

'కాంగ్రెస్ పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి.ప్రభాకర్

తుర్క ఎనెక్యపల్లి గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ

సన్న బియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.


లోకల్ గైడ్,పుడూర్:

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతి నిరుపేద కుటుంబానికి కడుపు నిండా సన్న భోజనం చేయాలనే సంకల్పంతో  సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకం ప్రారంభించడం ఎంతో హర్షణీయమని పూడూరు మండల బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి.ప్రభాకర్ అన్నారు.శుక్రవారం  గ్రామ రేషన్ దుకాణంలో గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యంను సరఫరా చేశారు. ఈ సందర్భంగా పూడూరు మండలం బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఎంతో చరిత్రాత్మక పథ కమన్నారు.ఆర్థికంగా ఉన్న కుటుంబాలే  తినే సన్నబియాన్ని రాష్ట్ర ప్రభుత్వ  సహకారంతోను ప్రతి నీరు పేద కుటుంబం నేడు సన్న బియ్యం తినే సదవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించడం ప్రతి ఒక్కరు అదృష్టంగా భావించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండలం బిసి సెల్ ప్రధాన కార్యదర్శి సి .ప్రభాకర్, మాజీ డిప్యూటీ సర్పంచ్ చింతలపల్లి.అంజయ్య, డీలర్ సునీత, మంటి గోపాల్, కరోబార్ యాదయ్య ,అంజమ్మ, జి. యాదమ్మ ,లక్ష్మమ్మ, చింతల పల్లి.కిష్టయ్య, తదితరులు పాల్గోన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News