నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దు

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దు

-నంబర్ ప్లేట్ లేని 50 వాహనాల పైన జరిమానా.

-వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలి.

-తాండూర్ టౌన్ సిఐ సంతోష్ కుమార్.

లోకల్ గైడ్/తాండూర్:
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దని తాండూర్ టౌన్ సీఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూర్ డిఎస్పి బాల కృష్ణ రెడ్డి..ఆదేశాల మేరకు, తాండూర్ పట్టణంలోనీ ఇందిర చౌక్ వద్ద నెంబర్ ప్లేట్ సరిగ్గ లేని వాహనాల గురించి స్పెషల్ డ్రైవ్  నిర్వహించడం జరిగింది.ఈ వాహనాల తనిఖీలో, సరైన నెంబర్ ప్లేట్ లేని సుమారు 50 మోటార్ సైకిల్స్ పైన మోటార్ వెహిల్స్ చట్టం ప్రకారం జరిమానా విధించి, వాహన యజమానుల నుండి కొత్త నెంబర్  ప్లేట్ వేయించడం జరిగింది సిఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని వాహనదారులకు హెచ్చరించారు. అదేవిధంగా వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా వాహనదారలు మద్యం సేవించి వాహనాలు నడపోద్దని ఆదేశించారు. బైక్ పైన వెళ్లేవారు త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, కారు నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
కామారెడ్డి : కేంద్ర మాజీ మంత్రి , స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్...
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపొద్దు
ఎంపీ వద్దిరాజు దివంగత ఉప ప్రధాని జగ్జీవన్ రాంకు ఘన నివాళులు