పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్?
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన గువాహటిలో బీసీసీఐ సమావేశం అవునన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు మరియు సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. కాగా గతంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో శ్రేయస్ అయ్యర్ కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు సమాచారం అందింది. ఒకవేళ అయ్యర్ ను తిరిగి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్టు లోకి తీసుకుంటే ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కాబట్టి ఈ మధ్య క్రికెట్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వారినీ నియమించే అవకాశం ఉంది. మరి ఎవరెవరు ఎలాంటి బంపర్ ఆఫర్లను పొందుతారో 29 వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
Comment List