మహేంద్రసింగ్ ధోనీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ఇండియన్ క్రికెటర్

మహేంద్రసింగ్ ధోనీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ఇండియన్ క్రికెటర్

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  మహేంద్రసింగ్ ధోని పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప తీవ్ర విమర్శలు చేశారు.   సీఎస్కే తరఫున ఐపీఎల్ లో ధోని ఆడే విధానంపై  విమర్శలు గుప్పించారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్  మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరగగా ఆ మ్యాచ్లో ధోని ఏడో స్థానంలో రావడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో కూడా మహేంద్ర సింగ్ ధోని 9 వ స్థానంలో బ్యాటింగ్ కూ వచ్చారు. ఇలా తొమ్మిది లేదా ఏడవ స్థానంలో రావడమేంటని... అసలు మొత్తానికి రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని రాబిన్ ఉత్తప్ప ఘాటుగా స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని ధోని మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఈసారి కొంచెం ముందు స్థానంలో బ్యాటింగ్ కు వస్తే సీఎస్కే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  ఉత్తప్ప తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక మహేంద్రసింగ్ ధోని ఆట తీరుపై ఫ్యాన్స్ సైతం చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరు కూడా ధోని ఆరవ స్థానంలో  బ్యాటింగుకు  రావాలని కోరుకుంటున్నారు.  మరి తర్వాత మ్యాచ్లో అయినా సరే మహేంద్ర సింగ్ ధోని ఆరవ స్థానంలో వస్తారా లేక ఇప్పటి లాగానే ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో వస్తారా అని ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. 

images (16)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!.. ఇదేం బ్యాటింగ్ శంకరన్న... CSK ను చూసి అందరూ నవ్వుతున్నారు!..
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా నిన్న  మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై మరియు  ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే...
నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆ సినిమా తీశా : మోహన్ బాబు
జగ్జివన్ రామ్ ఆశయ సాధనకు కృషిచేయాలి
శాంతి భద్రత తో పాటు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న క‌ల్కి సినిమా ద‌ర్శ‌కుడు
చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ గా మ‌ళ్లీ ధోనీ...
బాధిత కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్