పంజాబ్ చేతిలో ఓటమిపై ఆగ్రహం
By Ram Reddy
On
లోకల్ గైడ్:
లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యజమాని సంజీవ్ గోయెంకా తన నైజాన్ని మరోమారు బయటపెట్టుకున్నాడు. సీజన్లు మారుతున్నా..తన ప్రవర్తనలో ఇసుమంతైనా తేడా లేదని నిరూపించుకున్నాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ చేతిలో మ్యాచ్ ఓడిన తర్వాత మైదానంలోకి వచ్చిన గోయెంకా ప్లేయర్లను పలకరిస్తూ కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర ఆగిపోయాడు. పంజాబ్ చేతిలో భారీ ఓటమిని ప్రస్తావిస్తూ పంత్‌పై రుసరుసలాడుతూ కనిపించాడు. కెప్టెన్‌కు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా సంజ్ఞలు చేస్తూ ఆగ్రహం ప్రదర్శించాడు. మెగావేలంలో రికార్డు స్థాయిలో 27 కోట్లు పెట్టి తీసుకున్న పంత్ పేలవ ప్రదర్శన పట్ల గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కనిపిస్తున్నది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Apr 2025 15:02:17
లోకల్ గైడ్ తెలంగాణ కొత్తూరు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో9,10 సెంటర్లో రేషన్ షాప్...
Comment List