కోహ్లీ హెల్మెట్‌కి బలంగా తాకిన బాల్
విరాట్ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడంటే..!
లోకల్ గైడ్ తెలంగాణ :
విరాట్ కోహ్లీని ఎవరైన తక్కువగా అంచనా వేస్తే రియాక్షన్ వెంటనే ఉంది. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీని ఎవరైన తక్కువగా అంచనా వేస్తే రియాక్షన్ వెంటనే ఉంది. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ, చెన్నై తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కోపంతో ఊగిపోయాడు. పతిరణ వేసిన బంతి నేరుగా కోహ్లి హెల్మెట్‌కు బలంగా తగిలింది. బాడీ అటాక్‌గా పతిరణ బౌన్సర్ విసరడంతో షాట్‌కి ప్రయత్నించడంతో అది మిస్సయ్యి కోహ్లి హెల్మెట్‌కు తగిలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో సీఎస్‌కే బౌలర్ మతీష పతిరానా ఏకంగా విరాట్ కోహ్లీ తలకే గురిపెట్టి బౌన్సర్లు సంధించాడు. ఆ ఓవర్‌లో ఫస్ట్ బాలే కోహ్లీ హెల్మెట్‌కు చాలా బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ కూడా నిర్వహించారు. పతిరానా వేసిన ఆ డెడ్లీ బౌన్సర్ నేరుగా కోహ్లీ హెల్మెట్ ముందు భాగంలో చాలా బలంగా తాకిన కోహ్లీ మాత్రం గాయపడిన సింహంలా కసితో కనిపించాడే తప్ప ఫీల్డ్ వదిలి వెళ్లలేదు. కోపంతో తర్వాతి వేసిన అలాంటి బాల్‌ని ఏకంగా స్క్వౌర్ లెగ్ పైనుంచి సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఇలా ఆ ఓవర్‌లో ఫస్ట్ బాల్ హెల్మెట్‌కు తాకడంతో కోహ్లీ ఇగో హర్ట్ అయినట్లు అనిపించింది.
Comment List