ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు.. 

టీమిండియా టార్గెట్ ఎంతంటే?

ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు.. 

లోక‌ల్ గైడ్ : 
చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీఫైనల్లో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఒక దశలో 300 పరుగులు చేసేలా కనిపించిన ఆసీస్ కు చివరి ఓవర్లలో కళ్లెం వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలెక్స్ క్యారీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ట్రావిస్ హెడ్ (39) దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించినా వరుణ్ చక్రవర్తికి బలయ్యాడు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలకు చెరో రెండు వికెట్లు లభించాయి.

బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాథ్యూ షార్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన కూపర్ (0) డకౌట్ అయ్యాడు. అయితే ఆ ఆనందం భారత బౌలర్లకు ఎంతో సేపు నిలవలేదు. హెడ్ హిట్టింగ్ మొదలు పెట్టాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. దాంతో ఆసీస్ ఓవర్ కు 6 పరుగుల చొప్పున రన్ రేట్ ను మెయింటేన్ చేస్తూ ముందుకు సాగింది. అయితే వరుణ్ చక్రవర్తి డేంజరస్ హెడ్ ను అవుట్ చేశాడు. అనంతరం మార్నస్ లబుషేన్ (29)తో కలిసి స్మిత్ జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరు నెమ్మదిగా ఆడారు. అయితే కీలక సమయంలో లబుషేన్ అవుటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లీస్ (11) కూడా పెవిలియన్ కు చేరాడు.ఈ దశలో స్మిత్, అలెక్స్ క్యారీలు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు సమయోచితంగా ఆడారు. 30 ఓవర్లు దాటాకా వీరిద్దరు హిట్టింగ్ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే స్మిత్ ను షమీ అవుట్ చేశాడు. ఆ వెంటనే సిక్సర్ కొట్టి ఊపుమీద కనిపించిన మ్యాక్స్ వెల్ (7)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో అలెక్స్ క్యారీ అవుటవ్వడంతో ఆస్ట్రేలియా 264 పరుగులకు పరిమితం అయ్యింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు