ఆపద్బాంధవుడిలా అక్షర్.....
లోకల్ గైడ్ :
పదకొండేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా ఏడాదిన్నర క్రితం వరకూ రవీంద్ర జడేజా నీడన మరుగున పడిపోయిన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. ఇప్పుడు అతడి వారసుడిగా ఎదగడమే కాకుండా మిడిలార్డర్లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధారణంగా ఈ స్థానంలో అద్భుతమైన రికార్డు కలిగిన కేఎల్ రాహుల్‌ను వెనక్కి జరిపి మరీ అక్షర్‌ను ముందుకు పంపడం సాహసమే అయినప్పటికీ తనకు అప్పజెప్పిన బాధ్యతలకు అతడు వంద శాతం న్యాయం చేస్తున్నాడు.
పంత్ వైఫల్యంతో టాపార్డర్‌లో ఎడమ చేతివాటం బ్యాటర్ లేకపోవడం జట్టు కూర్పును దెబ్బతీస్తున్న తరుణంలో మేనేజ్మెంట్.. ఆ సమస్యకు అక్షర్ రూపంలో చెక్ పెట్టేందుకు ఈ ప్రయోగం చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 52, 41 నాటౌట్, 13తో మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ అక్షర్.. అటు బంతితో పాటు బ్యాట్‌తోనూ అంచనాలకు మించి రాణిస్తూ మిడిలార్డర్ కష్టాలకు చెక్ పెడుతున్నాడు.
Comment List