చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
లోకల్ గైడ్:
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై తెగ ప్రచారం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై తెగ ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఇటీవల రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బందిపడడమే. కానీ, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఫామ్‌లోకి వచ్చి టాప్ స్కోరర్‌గా నిలిచి.. విమర్శల నోళ్లను మూయించాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలోనే భారత్ 2024లో టీ20 వరల్డ్ కప్ నెగ్గగా.. తాజాగా ఐసీసీ రెండో టైటిల్‌ను గెలిచింది. 2002, 2013 తర్వాత ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా భారత జట్టు మూడోసారి టైటిల్‌ను నెగ్గింది. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు మూడోసారి టైటిల్ గెలుచుకోలేకపోయింది. ఇక ఈ ఐసీసీ ట్రోఫీ విజేత భారత జట్టుపై కాసుల వర్షం కురిసింది.భారత జట్టు 2.4 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.19.5కోట్లు. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని గతంలో పోలిస్తే 53శాతం పెంచిన విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్‌లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ.4.86కోట్లు లభించాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 6.9మిలియన్ డాలర్ల (రూ.60కోట్లు) కు పెరిగిందని ఐసీసీ అధ్యక్షుడు జైషా ఒక ప్రకటనలో పెరిగిందని పేర్కొన్నారు. ఇక.. గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30లక్షల ప్రైజ్‌మనీ లభించనున్నది.ఐదు, ఆరోస్థానంలో నిలిచిన జట్లకు సుమారుగా రూ.3కోట్లు.. ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2కోట్ల లభించాయి. అంతేకాకుండా ఐసీసీ టోర్నీలో పాల్గొన్నందుకు ఎనిమిది జట్లకు రూ.1.08కోట్లు దక్కాయి.
Comment List