అటల్ జీ యాది లో ఆత్మీయ సమ్మేళనం

అటల్ జీ యాది లో ఆత్మీయ సమ్మేళనం

 లోకల్ గైడ్ తెలంగాణ, వరంగల్ జిల్లా ప్రతినిధి: భారతరత్న, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం రోజున వరంగల్ లోని డి కన్వెన్షన్  లో  అటల్ జి యాది లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్   సభాధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ  జర్నలిస్ట్ గా వాజపేయ్  ప్రస్థానం ప్రారంభమైంది.శ్యాంప్రసాద్ ముఖర్జీ తో ఉన్న అనుబంధం  దేశభక్తునిగా మార్చింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ బోధనలు విని, భరతమాత రోదనలు చుసి, భారతీయుల ఆవేదన చుసి అజన్మాంతం బ్రహ్మచారీ గా ఉండాలని నిర్ణయించుకున్నాడని, భారత రాజకీయాలలో భావజాలాలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన ఏకైక రాజకీయ నాయకుడు వాజ్ పేయి అని, బతికినన్ని రోజులు అజాతశత్రువుగా బతికిన గొప్ప రాజకీయ నాయకుడని, ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసిన ఢిల్లీ పీఠన్ని వదులుకున్నాడు కానీ విలువలు వదులుకొని మహోన్నత వ్యక్తి వాజేపెయ్ అని అన్నారు.స్వర్ణభుజీ రహదారుల నిర్మాణం తో నవభారత నిర్మాణనినికి పునాదులు వేసాడని, పనికి ఆహారపథకం తెచ్చి కొన్ని కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చిండు అని, ప్రధాని సదక్ యోజనతో మారుముల పల్లెలకు కూడా బీటీ రోడ్లు వేసిండని, పొక్రాన్ లోను అణు పరీక్ష చేసి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించిండని, ఎన్ని దేశాలు ఒత్తిడి చేసిన, ఆర్థిక పరమైన ఆంక్షలు విధించించిన వెనక్కి తగ్గని మొండి ధైర్యం వాజేపెయ్ సొంతమని, వాజపేయ్ కవితా పటిమ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకునికి రాలేదని,  భారత మాత కన్న అసలు సిసలైన నిజమైన భారతరత్న వాజపేయ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, మాజీ మేయర్ టి. రాజేశ్వర రావు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు నాగపురి రాజమౌళి గౌడ్, మంద ఐలయ్య, కన్నబోయిన రాజయ్య యాదవ్, దేవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి, బలరాం, సోడా రమేష్,  ప్రోగ్రాం కన్వీనర్లు, బిజెపి నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.