దమ్ముంటే కేసీఆర్ ను చర్చకు రమ్మను:- సీఎం రేవంత్
లోకల్ గైడ్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హరీష్ రావు ను తీవ్రంగా విమర్శించారు. తాటి చెట్టు అంత పెరిగిన ఆవకాయంత తెలివితేటలు హరీష్ రావుకు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాగార్జునసాగర్ అలాగే ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి లాంటి ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు లే నేడు తెలంగాణ రాష్ట్రానికి నీటిని అందిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులపై మీలాంటి పిల్ల కాపులు కాకుండా నేరుగా కేసీఆర్ ను చర్చకు రమ్మని హరీష్ రావుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా ఇంతకుముందు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. గతంలో కేసీఆర్ను అలాగే కేటీఆర్ ను ఎలాపడితే అలా దూషించారని ఒకానొక సమయంలో కాల్చిపారేస్తామని రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్ రెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చారు.
Comment List