బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.

రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదు

బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు నిధులు పెంచాలి.

బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ .

లోకల్ గైడ్ తెలంగాణ:

 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోని బీసీల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం 20 ,000 కోట్ల నిధులు కేటాయిస్తామని అధికారంలోకి రాకమందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు స్పష్టంగా ప్రకటించిందని, ఈ నెల 19వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని మొదటి బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రెండు లక్షల 91 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే అందులో 9200 కోట్లు మాత్రమే కేటాయించిందని, 60 శాతం ఉన్న బీసీలకు  3శాతం నిధులు కేటాయించిందని, ఇందులో కూడా 2 శాతమే నిధులు ఖర్చు చేసింది  విమర్శించారు.గత బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల గణాంకాలు అందుబాటులో లేనందున తక్కువ నిధులు కేటాయించారని ,ప్రస్తుతం బీసీల జనాభా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వమే 56% ఉన్నారని అధికారికంగా తేల్చిన సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ కులగణన అనంతరం ఈమధ్య నియమించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఏవిధంగానైతే జనాభా ప్రకారం సామాజిక న్యాయం పాటించి బీసీ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించారో బడ్జెట్లో కూడా జనాభా దామషా ప్రకారం నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయం అనేక సభలలో పదేపదే చెప్తున్నందున వారి మాటను గౌరవించి బీసీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కట్టెకోలు దీపెందర్ కోరారు.ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, జక్కలి సాయిరాం, కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.