లక్నో రాత మారేనా?

లక్నో రాత మారేనా?

లోకల్ గైడ్ :

 ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఆగమనమే ఓ సంచలనం. 2022లో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ఆగమనమే ఓ సంచలనం.2022లో లక్నో ఫ్రాంచైజీని ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గొయెంకా ఏకంగా రూ. 7,090 కోట్లతో సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.భారీ మొత్తానికి తగ్గట్టుగానే లక్నో కూడా తొలి రెండు సీజన్లలో అంచనాలకు మించి రాణించింది. బంతిని బలంగా బాదే నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టోయినిస్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు..మాజీ సారథి కేఎల్‌ రాహుల్‌,క్వింటన్‌ డికాక్‌ నిలకడైన ఆటతీరు.. అయూష్‌ బదోని, రవి బిష్ణోయ్‌,అవేశ్‌ ఖాన్‌, కృనాల్‌ పాండ్యా,మోహ్సిన్‌ ఖాన్‌,మయాంక్‌ యాదవ్‌ వంటి వర్ధమాన క్రికెటర్ల మెరుపులతో ఆ జట్టు వరుసగా 2022,2023 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి మూడో స్థానంలో నిలిచింది.కానీ 2024లో మాత్రం తడబాటుకు గురై ఏడో స్థానంతో ముగించింది. తమతో పాటే లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌.. 2022లో టైటిల్‌ గెలవడంతో పాటు 2023లో ఫైనల్‌ చేరినా లక్నో మాత్రం రెండు సీజన్లలో టైటిల్‌కు దగ్గరగా వచ్చినా ఆ ముచ్చటను తీర్చుకోలేకపోయింది. ఈ సీజన్‌లో కొత్త కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ సారథ్యంలో బరిలోకి దిగనున్న లక్నో.. నాలుగో ప్రయత్నంలో అయినా కప్పు కలను నెరవేర్చుకుంటుందేమో చూడాలి. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
లోకల్ గైడ్:ఒంటరిగా కూర్చుని ఏడవలేను! బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు వైఫల్య ప్రదర్శన అనంతరం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకొచ్చిన నిబంధలలో భాగంగా.....
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?
కట్ర్యాల లో అగ్ని ప్రమాదం 
అటల్ జీ యాది లో ఆత్మీయ సమ్మేళనం
కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మల దగ్ధం
అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి