ముఖ్యమంత్రిని పశువు అన్న హరీష్ రావు!..

ముఖ్యమంత్రిని పశువు అన్న హరీష్ రావు!..

లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.  తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు   డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే నెంబర్ 1 గా ఉంచిన ఆయనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. గతంలోనూ కెసిఆర్ ను కాల్చి పారేయాలని నోటికొచ్చిన మాటలు అన్నావు. అంతటితో ఆగకుండా కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ని కూడా నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడావు. చివరికి images (7) నా ఎత్తు గురించి కూడా అడ్డమైన కూతలు కూసావ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాజకీయాల్లో బాడీ షేమింగ్ అనేది  ఉంటుందా అని ప్రశ్నించారు. అసలు నువ్వు మనిషివా?.. లేక పశువువా?.. అన్నం తినే వాళ్ళు ఎవరూ కూడా ఇలా మాట్లాడరు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రంగా ఫైర్ అయ్యారు హరీష్ రావు. నోటికి వచ్చింది ఏది పడితే అది వాగ కూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. 

Tags: Harishrao

About The Author

Post Comment

Comment List

Latest News

అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌.. అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
లోకల్ గైడ్: ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో విజ‌య‌శాంతి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి . కొత్త దర్శకుడు ప్రదీప్...
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?
కట్ర్యాల లో అగ్ని ప్రమాదం 
అటల్ జీ యాది లో ఆత్మీయ సమ్మేళనం
కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మల దగ్ధం