నితీశ్ కుమార్ రెడ్డి ఫుల్ ఫిట్..
సన్‌రైజర్స్‌తో కలవనున్న ఆల్‌రౌండర్
లోకల్ గైడ్ :
యో-యో టెస్టులో నితీశ్ రెడ్డి క్లియర్ అయ్యాడు. ఇక అతను సన్‌రైజర్స్ జట్టుతో కలవనున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా ఆడిన నితీశ్ ప్రస్తుతం బెంగుళూరు అకాడమీలో గాయం నుంచి కోలుకుంటున్నాడు.ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఫిట్‌నెస్ పరీక్షలో క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పితో బాధపడుతున్న నితీశ్.. ఫుల్ ఫిట్ అయినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. అయితే త్వరలోనే అతను హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుతో కలవనున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. క్రికెటర్ నితీశ్ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సమయంలో అతను గాయానికి గురయ్యాడు.ఫిట్‌నెస్‌కు చెందిన అన్ని రొటీన్ పరీక్షలను నితీశ్ రెడ్డి క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. యో-యో టెస్టులో కూడా అతను పాసైనట్లు రిపోర్టు ఉంది. బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నితీశ్ .. కోలుకుంటున్నాడు. ఫిజియో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో ఆడినా.. దాంట్లో అతను బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చేయలేదు.ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు .. నితీశ్ రెడ్డిని 6 కోట్లకు ఖరీదు చేసింది. గత సీజన్‌లో అతను 13 మ్యాచుల్లో 303 రన్స్ చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 143గా ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతను తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో విరోచితంగా 114 రన్స్ చేశాడు.సన్‌రైజర్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌లో ఆడనున్నది.
Comment List