ఈనెల 16న తుంగతుర్తిలో జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి 

యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ 

ఈనెల 16న తుంగతుర్తిలో జరిగే కృతజ్ఞత సభను విజయవంతం చేయాలి 

లోకల్ గైడ్ తెలంగాణ:

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ,బీసీ కులాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోటే సాధ్యం అవుతుందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్  అన్నారు.శనివారం  స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ  నెల16న  తుంగతుర్తి లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించే కాంగ్రెస్ కృతజ్ఞత సభను విజయవంతం  చేయాలని కోరారు.దశాబ్ద కాలంగా ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ,బిసి కుల గణాలను చేయడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండిటిని విజయవంతంగా అమలు చేసినందుకుగాను కృతజ్ఞత పూర్వకంగా ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన నిర్వహించే సభను విజయవంతం చేయాలన్నారు. అసెంబ్లీలో స్పీకర్ పై అగ్రవర్ణ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని పూర్తిగా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పై ఏక వచనంగా  సంబోధించిన తీరు ను ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?